Abn logo
Sep 14 2021 @ 20:05PM

ఛత్తీస్‌గడ్ పోలీసుల అదుపులో మావోయిస్టు నేత దుబాషి శంకర్?

సిద్దిపేట: మావోయిస్టు మిలటరీ కమిషన్ మెంబర్, కీలక మావోయిస్టు నేత  దుబాషి శంకర్ అలియాస్ మహేందర్ అలియాస్ అరుణ్ అలియాస్ రమేష్ లను ఛత్తీస్‌గడ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దుబాషి శంకర్‌ స్వస్థలం సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్ మండలం. 1987లో ఇందుప్రియల్ ఏరియా కమిటీలో శంకర్‌ చేరాడు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా శంకర్ పనిచేసాడు. ప్రస్తుతం  స్టేట్ మిలటరీ కమిషన్ మెంబర్‌గా శంకర్ పనిచేస్తున్నాడు. పలు కీలక మావోయిస్టు ఆపరేషన్లలో శంకర్ పాల్గొన్నాడు. తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్‌లలో శంకర్‌పై 40కు పైగా కేసులు నమోదయ్యాయి. శంకర్‌ అరెస్ట్‌ను పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.