మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్

ABN , First Publish Date - 2021-03-05T16:41:35+05:30 IST

జిల్లాలోని ఏటిగడ్డ కిష్టాపూర్‌కు వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద అరెస్ట్ చేశారు.

మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్

సిద్దిపేట: జిల్లాలోని ఏటిగడ్డ కిష్టాపూర్‌కు వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో ఎమ్మెల్యే మాట్లాడుతూ భూనిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే అరెస్టు చేయడం దారుణమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఫాంహౌజ్‌లో కూర్చుండి కాంట్రాక్టర్ల కోసం నిర్వాసితులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. గజ్వేల్, సిద్దిపేట తరహా మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘కలెక్టర్‌కు గాని, ఎంపీ, ఎమ్మెల్యేకు గాని చిత్తశుద్ధి ఉంటే మల్లన్నసాగర్ కట్ట మీదికి రండి..నేను ఒక్కడినే వస్తాను... దొంగల్లాగ దారులు కాచి అరెస్టు చేయడం ఎందుకు’’ అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ప్రతీరోజు జిల్లాలో సెక్షన్ తర్టీ ఉండడం గమనార్హమన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కు ఒక న్యాయం.. దుబ్బాకకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. అందుకే దుబ్బాకలో తమను ఓడగొట్టారన్నారు. తొగుటలో చీకటి ప్రజాస్వామ్యం నడుస్తోంది.. ఎందుకు? అని నిలదీశారు. ‘‘దుబ్బాకలో పోలీసులతో గొంతు నొక్కుతున్నారేమో- రానున్న అసెంబ్లీలో మాత్రం నొక్కలేరు.. అక్కడ మాట్లాడుతాను’’ అంటూ ఎమ్మెల్యే రఘునందన్‌రావు హెచ్చరించారు. 

Updated Date - 2021-03-05T16:41:35+05:30 IST