రోగ నిరోధక వ్యవస్థ అతి స్పందన వల్లే కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-05-14T15:03:12+05:30 IST

కరోనా వైరస్‌ ఎందుకు ప్రాణాంతకమైంది? దీన్ని తెలుసుకునేందుకు చైనాలోని జున్‌యీ మెడికల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో పలు కొత్త విషయాలు వెలుగుచూశాయి.

రోగ నిరోధక వ్యవస్థ అతి స్పందన వల్లే కరోనా మరణాలు

బీజింగ్‌/వాషింగ్టన్‌, మే 13: కరోనా వైరస్‌ ఎందుకు ప్రాణాంతకమైంది? దీన్ని తెలుసుకునేందుకు చైనాలోని జున్‌యీ మెడికల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో పలు కొత్త విషయాలు వెలుగుచూశాయి. వైరల్‌ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు నిర్దిష్టంగా స్పందించాల్సిన రోగనిరోధక వ్యవస్థ తన పరిధిని దాటి అతిగా స్పందించడం వల్లే కరోనా రోగుల ప్రాణాలపైకి వస్తోందని వారు వెల్లడించారు. శ్వాసకోశ వ్యవస్థలో కరోనా వైరస్‌ తన సంఖ్యను భారీగా పెంచుకున్న తర్వాత రోగ నిరోధక వ్యవస్థ ఆలస్యంగా మేల్కొని.. ఒక్కసారిగా రక్తంలోకి పెద్దసంఖ్యలో ‘సైటోకైన్‌’లను విడుదల చేస్తోంది. ఈ ప్రక్రియను ‘సైటోకైన్‌ స్టార్మ్‌’ అంటారు. ఇది సంభవించడం వల్లే శ్వాసకోశ వ్యవస్థ కుదేలై కరోనా రోగి ప్రాణాలకు ముప్పు వస్తుంది.

Updated Date - 2020-05-14T15:03:12+05:30 IST