‘టిక్‌టాక్‌’ దెబ్బ.. అమెరికాలో స్కూళ్లు బంద్‌!

ABN , First Publish Date - 2021-12-18T14:24:32+05:30 IST

సరదా వీడియోలతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే టిక్‌టాక్‌, అమెరికాలో బడి పిల్లల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను భయకంపితులను చేసి చెమటలు పట్టిస్తోంది. బడుల్లో కాల్పులు జరుపుతామని, బాంబులు పేల్చు

‘టిక్‌టాక్‌’ దెబ్బ.. అమెరికాలో స్కూళ్లు బంద్‌!

న్యూఢిల్లీ: సరదా వీడియోలతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే టిక్‌టాక్‌, అమెరికాలో బడి పిల్లల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను భయకంపితులను చేసి చెమటలు పట్టిస్తోంది. బడుల్లో కాల్పులు జరుపుతామని, బాంబులు పేల్చుతామంటూ హెచ్చరికలతో కూడిన వీడియో.. టిక్‌టాక్‌లో వైరల్‌గా మారడంతో అమెరికా వ్యాప్తంగా స్కూళ్లు అలర్ట్‌ అయ్యాయి. వీడియో హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారమైతే దేశవ్యాప్తంగా బడులను బంద్‌ పెట్టారు. కాలిఫోర్నియా, టెక్సస్‌, మిన్నెసోటా తదితర రాష్ట్రాల్లో స్కూళ్లను మూసేస్తే.. మిగతా రాష్ట్రాల్లో స్కూల్‌ యాజమాన్యాల ఫిర్యాదుతో పోలీసులు మోహరించారు. టిక్‌టాక్‌ వీడియో హెచ్చరిక.. గన్‌కల్చర్‌ బాగా పెరిగిపోయిన నేపథ్యంలో తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై టిక్‌టాక్‌ స్పందన భిన్నంగా ఉండటం విశేషం. ప్రత్యేకమైన హెచ్చరికలతో కూడిన వీడియోలను గుర్తించలేదని చెప్పింది. బడుల్లో కాల్పులు జరుపుతామనే హెచ్చరికలతో కూడిన వీడియోల వ్యాప్తిపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. 




Updated Date - 2021-12-18T14:24:32+05:30 IST