నేను మాత్రమే బీసీని కానా?

ABN , First Publish Date - 2021-10-18T05:12:20+05:30 IST

‘నా కుటుంబసభ్యులందరూ బీసీలే. వారికి బీసీ - ఈ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. నేను మాత్రం బీసీ కాకుండా ఎలా పోతాను.

నేను మాత్రమే బీసీని కానా?
సమావేశంలో పాల్గొన్న దుగ్గిరాల టీడీపీ ఎంపీటీసీ సభ్యులు

కుటుంబీకులందరికీ ఽధ్రువీకరణ ఇచ్చారుగా 

అధికారులు ఏం చేసినా న్యాయస్థానాలపై నమ్మకం 

దుగ్గిరాల టీడీపీ ఎంపీపీ అభ్యర్థి జబీనా

 

దుగ్గిరాల, అక్టోబరు 17: ‘నా కుటుంబసభ్యులందరూ బీసీలే. వారికి బీసీ - ఈ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. నేను మాత్రం బీసీ కాకుండా ఎలా పోతాను. బీసీ-ఈ ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా అడ్డుకుం టున్నారు. స్థానిక ఎమ్మెల్యే ముస్లిం ద్రోహిలా వ్యవహరిస్తు న్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగం పైన, న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది.’ అని దుగ్గిరాల టీడీపీ ఎంపీపీ అభ్యర్థి జబీనా తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఎంపీటీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జబీనా మాట్లాడుతూ 18 మందికి 9 మంది టీడీపీ సభ్యులు, టీడీపీ మద్దతుతో గెలిచిన జనసేన అభ్యర్థితో కలిపి 10మంది ఎంపీటీసీలు తాముంటే ఎంపీపీ పదవి మాకే అని వైసీపీ వారు ఎలా ప్రకటిస్తారన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ఎమ్మెల్యే ఆళ్ల, అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నారన్నారు. గత నెల 24న జరగాల్సిన ఎన్నికను పలు రకాలుగా వైసీపీ నేతలు అడ్డుకుంటూ వచ్చారన్నారు. ఎన్నికలకు ముందే టీడీపీ తరపున పోటీలో ఉన్న ఇద్దరు ఎంపీటీసీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేశారన్నారు. పెదకొండూరు(జనసేన) ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు విషయంలో జరిగిన అన్యాయం చూస్తే, ప్రజాస్వా మ్యంలో ఉన్నామా.. లేదా అన్న అనుమానం కలుగుతుందన్నారు. ఎన్నో పర్యాయాలు కోర్టుచే మొట్టికాయలు వేయించుకున్నప్పటికీ రాజారెడ్డి రాజ్యాంగాన్నే అమలు చేస్తున్నారన్నారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎంపీపీ, ఉపాఽధ్యక్ష, కో-ఆప్షన్‌ పదవులను కైవసం చేసుకుంటామన్నారు. అధికారులు వైసీపీకీ తొత్తులుగా మారవద్దన్నారు. అన్నిరకాలుగా అర్హత ఉన్నప్పటికీ ధ్రువీకరణపత్రాన్ని తిరస్కరించిన అధికారుల ద్వారా తిరిగి బీసీ- ఈ ధ్రువీకరణ పొందు తామన్నారు.  సమావేశంలో గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు పోతినేని శ్రీనివాసరావు, మండల   అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు, ఎంపీటీసీలు తాళ్ల అశోక్‌ (పేరు కలపూడి), వాసిరెడ్డి లక్ష్మి(తుమ్మపూడి), పుతుంబాక సాయికృష్ణ(పెదపాలెం), మరీదు రాము (మంచి కలపూడి), విశ్వనాథపల్లి శివకుమార్‌ (గొడవర్రు), కొప్పుల మధుబాబు(రేవేంద్రపాడు), చిలువూరు రోజమరియమ్మ, (చిలువూరు-2), గేరా నిర్మల(ఈమని-2) పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-18T05:12:20+05:30 IST