దమ్‌ ఆలూ

ABN , First Publish Date - 2021-03-25T20:49:35+05:30 IST

బేబీ ఆలుగడ్డలు (ఉప్పేసి ఉడికించి, తొక్క ్టతీసినవి): 20, కారం: మూడు స్పూన్లు, పెరుగు: ఆరు స్పూన్లు, లవంగాలు, యాలకులు:

దమ్‌ ఆలూ

కావలసిన పదార్థాలు: బేబీ ఆలుగడ్డలు (ఉప్పేసి ఉడికించి, తొక్క ్టతీసినవి): 20, కారం: మూడు స్పూన్లు, పెరుగు: ఆరు స్పూన్లు, లవంగాలు, యాలకులు: మూడు చొప్పున, నీళ్లు: కప్పున్నర, ఇంగువ: కాస్త, కొత్తిమీర తురుము, ఉప్పు, నూనె: అవసరమైనంత, మిరియాల పొడి, శొంఠి పొడి: అర స్పూను, జిలకర: అర స్పూను


తయారుచేసే విధానం: మసాలా దినుసులన్నిటినీ పొడిచేసి పెట్టు కోవాలి. కారం పొడిని కాస్త నీళ్లలో వేసి కలియబెట్టాలి. ఓ పాన్‌లో కాస్త నూనె వేయాలి. ఒక్కో ఆలుగడ్డనూ వేసి బంగారు రంగులోకి వచ్చే వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో రెండు స్పూన్ల నూనె వేసి కాగాక ఇంగువ పొడి వేయాలి. కారం నీళ్లని, పెరుగునూ వేసి, నీటినీ జతచేసి బాగా కలపాలి. ఉప్పు, మసాలా పొడులన్నిటినీ వేసి ఉడికించాలి. వేయించిన ఆలు గడ్డలనూ వేసి పాన్‌కి మూతపెట్టి ఎనిమిది నిమిషాలు ఉడికిస్తే దమ్‌ ఆలూ రెడీ. పైన కొత్తిమీర తురుమును వేస్తే సరి.

Updated Date - 2021-03-25T20:49:35+05:30 IST