డూ ప్లెసిస్ అవుట్.. చెన్నై 45/2

ABN , First Publish Date - 2021-04-20T01:33:04+05:30 IST

రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. బౌండరీలతో ధాటిగా ఆడుతున్న ఫాఫ్ డూ ప్లెసిస్(33: 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ షాట్ ఆడే క్రమంలో ..

డూ ప్లెసిస్ అవుట్.. చెన్నై 45/2

ముంబై: రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. బౌండరీలతో ధాటిగా ఆడుతున్న ఫాఫ్ డూ ప్లెసిస్(33: 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ షాట్ ఆడే క్రమంలో అవుటయ్యాడు. మోరిస్ వేసిన అవుట్ సైడ్ ఆఫ్ స్టంబ్ బంతిని ముందుకు దూకి ఆడే క్రమంలో డూ ప్లెసిస్ గాల్లోకి లేపగా థర్డ్ మ్యాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రియాన్ పరాగ్‌ సునాయాసంగా క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం చెన్నై స్కోరు 2 వికెట్లకు 45 పరుగులుగా ఉంది. క్రీజులో మొయీన్ అలీ(2), సురేశ్ రైనా(0) క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-04-20T01:33:04+05:30 IST