Abn logo
Oct 13 2021 @ 19:47PM

దుర్గాదేవిగా జగన్మాత దర్శనం

విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఏడో రోజు బుధవారం (దుర్గాష్టమి) దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. త్రిశూలాన్ని చేతబట్టి కోటి సూర్యప్రభలతో సాక్షాత్కరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు అమ్మవారికి మహానివేదన, పంచహారతుల సేవ నిర్వహించిన అనంతరం ప్రదోష కాలంలో శ్రీ గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల  ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగిస్తూ వైభవంగా పల్లకీ సేవ నిర్వహించారు. గురువారం మహర్నవమి నాడు జగన్మాత దుర్గమ్మ మహిషాసురమర్ధనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...