దుర్గా పూజపై నిషేధం: యూపీ సీఎం యోగి

ABN , First Publish Date - 2021-03-02T21:17:19+05:30 IST

రాష్ట్రంలో పాలన దారుణంగా ఉంది. హిందువుల మనోభావాల్ని మమతా బెనర్జీ ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రభుత్వ విధానాల్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. దుర్గా పూజకు అనుమతి నిరాకరించారు. ఈద్‌కు గోవధను ప్రారంభించారు. కానీ ప్రభుత్వం దీనిపై ఏమీ మాట్లాడటం లేదు

దుర్గా పూజపై నిషేధం: యూపీ సీఎం యోగి

కోల్‌కతా: ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజపై మమతా బెనర్జీ నిషేధం విధించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని మాల్దాలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ఎన్నిక ప్రచార ర్యాలీలో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలకు అతీతంగా పాలన సాగుతోందని దుయ్యబట్టారు. లవ్ జిహాదీలను అనుమతిస్తూ గోవధను ప్రోత్సహిస్తున్నారని యోగి ఆరోపణలు గుప్పించారు.


‘‘రాష్ట్రంలో పాలన దారుణంగా ఉంది. హిందువుల మనోభావాల్ని మమతా బెనర్జీ ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రభుత్వ విధానాల్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. దుర్గా పూజకు అనుమతి నిరాకరించారు. ఈద్‌కు గోవధను ప్రారంభించారు. కానీ ప్రభుత్వం దీనిపై ఏమీ మాట్లాడటం లేదు. ఇవన్నీ ప్రభుత్వ సహకారంతోనే జరుగుతున్నాయి. ఇక్కడ ‘జై శ్రీరాం’ అనడాన్ని కూడా ఇష్టపడటం లేదు. మేము యూపీలో లవ్ జిహాద్ చట్టం తీసుకువచ్చాం. కానీ బెంగాల్‌లో లోపాయికారి రాజకీయాలు నడుస్తున్నాయి. అందుకే వాళ్లు లవ్ జిహాదీపై చట్టం చేయడం లేదు’’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

Updated Date - 2021-03-02T21:17:19+05:30 IST