ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు: దుర్గగుడి చైర్మన్

ABN , First Publish Date - 2021-10-03T01:09:37+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు: దుర్గగుడి చైర్మన్

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు: దుర్గగుడి చైర్మన్

విజయవాడ: అక్టోబర్ 7 నుంచి 15 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయడు తెలిపారు. రోజుకు పదివేల మంది భక్తులకు ఆన్‌లైన్ స్లాట్ ద్వారా మాత్రమే దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తామన్నారు. నాలుగు వేల మందికి ఉచిత దర్శనం, మూడు వేల మందికి 300 రూపాయల టిక్కెట్ దర్శనం, మరో 300 మందికి 100 రూపాయల దర్శనం కేటాయించామని ఆయన తెలిపారు. మూలా నక్షత్రం రోజున పది  వేల మంది భక్తులను పెంచే దానిపై నిర్ణయిస్తామన్నారు.  తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. 


11వ తేదీన రెండు అలంకారాల్లో దుర్గమ్మ  దర్శనమివ్వనున్నారు. ఉదయం అన్నపూర్ణాదేవి అలంకారంలో, మధ్యాహ్నం శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ 12  మూలానక్షత్రం రోజున దుర్గమ్మకు పట్టు వస్ర్తాలు సీఎం జగన్ సమర్పించనున్నారు. దసరాలో ఉదయం 3 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు దుర్గమ్మ దర్శనం ఉంటుందన్నారు. మూలానక్షత్రం రోజు తెల్లవారుజామున వేకువజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దుర్గమ్మ దర్శనం ఉంటుదని తెలిపారు. 7 వ తేదీన తొలిరోజు దుర్గమ్మ శ్రీ స్వర్ణకవచాలంక్రుత దుర్గాదేవిగా  భక్తులకు దర్శనమిస్తారని ఆయన పేర్కొన్నారు. వీఐపీలు ఖచ్చితంగా స్లాట్ లేదా కరెంటు బుకింగ్ ద్వారా టిక్కెట్ తీసుకోవాల్సిందేనని సూచించారు. ఈ ఏడాది కోటి రూపాయలుతో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 


Updated Date - 2021-10-03T01:09:37+05:30 IST