దుర్గమ్మ నిమజ్జనోత్సవం

ABN , First Publish Date - 2021-10-17T05:04:36+05:30 IST

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కర్నూలు నగరంలో వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన దుర్గామాత విగ్రహాలను శనివారం భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.

దుర్గమ్మ నిమజ్జనోత్సవం
దుర్గమ్మ నిమజ్జనం


కర్నూలు(కల్చరల్‌), అక్టోబరు 16: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కర్నూలు నగరంలో వివిధ ప్రాంతాల్లో  నెలకొల్పిన దుర్గామాత విగ్రహాలను శనివారం భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. తుంగభద్ర నది ఒడ్డున దుర్గా ఘాట్‌లో అధికారులు నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు నడుమ వేడుకలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ నది ఒడ్డున తుంగభద్రతమ్మ విగ్రహానికి పూజలు నిర్వహించారు.  నేతాజీ నగర్‌లో నెలకొల్పిన దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని డీఎస్పీ కేవీ మహేష్‌ స్వయంగా మోసుకుంటూ నిమజ్జనాన్ని ప్రారంభించారు. టూటౌన సీఐ పార్థసారథి రెడ్డి, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, బ్రాహ్మణ సంఘాల నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు.


బేతంచెర్లలో...

బేతంచెర్ల మండల పరిధిలోని పలు ప్రాంతాలలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. బేతంచెర్ల పట్టణం, సిమెంట్‌నగర్‌, సంజీవనగర్‌, హనుమాన నగర్‌ ప్రాంతాల్లో దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలకు తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించారు. అనంతరం శనివారం ఊరేగింపుగా అమ్మవారి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల కోలాహలం, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అయ్యలవారి చెరువు వినాయకఘాట్‌లో నిమజ్జనం చేశారు. సీఐ  కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాసులు బందోబస్తు నిర్వహించారు.




Updated Date - 2021-10-17T05:04:36+05:30 IST