Abn logo
Oct 15 2021 @ 01:31AM

మహిషాసురమర్దినిగా దుర్గమ్మ

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ 

విజయవాడ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఎనిమిదో రోజు గురువారం మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్సవాల చివరిరోజు శుక్రవారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. కాగా, కనకదుర్గమ్మకు టీటీడీ పేష్కార్‌ సూపరింటెండెంట్‌ పట్టువస్త్రాలను సమర్పించారు. కాగా, దసరా రోజున దుర్గామల్లేశ్వరస్వామివారికి కృష్ణానదిలో నిర్వహించే జలవిహారాన్ని అధికారులు రద్దుచేశారు. పంటుపై ఉత్సవమూర్తులకు పూజలు మాత్రమే నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ స్పష్టం చేశారు.