వైభవంగా దుర్గమ్మ ఊరేగింపు

ABN , First Publish Date - 2021-10-18T06:20:57+05:30 IST

తాళ్లూరులోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి, రుక్ష్మిణీ సమేత వేణుగోపాల స్వాముల ఆలయ ప్రాంగణంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గామాతకు శనివారం రాత్రి అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.

వైభవంగా దుర్గమ్మ ఊరేగింపు
పామూరులో విశేష అలంకరణలో అమ్మవారు

తాళ్లూరు, అక్టోబరు 17 : తాళ్లూరులోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి, రుక్ష్మిణీ సమేత వేణుగోపాల స్వాముల ఆలయ ప్రాంగణంలో  దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గామాతకు శనివారం రాత్రి అత్యంత వైభవంగా  గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారి  ఆలయాల వద్ద తాళ్లూరు గ్రామవాసీ సూళ్లూరుపేట సీఐ ఇడమకంటి వెంకటేశ్వరెడ్డి సారధ్యంలో 10 రోజుల క్రితం దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వివిధ అలంకరణల్లో ప్రత్యేక పూజలు చేశారు. దశమి పూర్తయిన రెండోరోజు శనివారం రాత్రి ప్రత్యేక వాహనంలో పూలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు.  భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పూజారి నరసింహాచార్యులు పాల్గొన్నారు.

పామూరు : దసరా నవరాత్రుల ముగింపు సందర్భంగా  స్థానిక వాసవిమాత దేవస్ధానంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పలు రకాల పూలలతో అలంకరించిన ఊయలలో అమ్మవారిని శయనింపచేసి పల్లకీసేవ కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాలతో దసరా వేడుకలు సంపూర్ణంగా ముగిసినట్లు అర్చకులు, దేవస్థాన నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన గౌరవ అధ్యక్షుడు మణికంఠస్వామి, దేవస్థాన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు వై.బాలకొండలరావు, శేగు.కిష్టయ్య, దర్శి మస్తాన్‌రావు, గోస్టు రామారావు, ఎన్‌ సుబ్బారావుతో పాటు ఆర్యవైశ్య సంఘం, మహిళ యువజన, బాలకుటీరం సంఘంతో పాటు వాసవి క్లబ్‌ సభ్యులు, ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T06:20:57+05:30 IST