పండగ వేళ.. ‘స్పందన’కు జనం కరువు

ABN , First Publish Date - 2021-08-03T06:51:20+05:30 IST

ఆడికృత్తిక పండగ కారణంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జనం పలుచగా వచ్చారు.

పండగ వేళ.. ‘స్పందన’కు జనం కరువు
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు

చిత్తూరు, ఆగస్టు 2: ఆడికృత్తిక పండగ కారణంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జనం పలుచగా వచ్చారు. వచ్చిన వారినుంచి వినతిపత్రాలను కలెక్టర్‌ హరినారాయణన్‌, అధికారులు స్వీకరించారు. ఫ పాఠశాల సమీపంలోనే తవణంపల్లె వైసీపీ మండల కన్వీనర్‌ ప్రతాప్‌రెడ్డి ఓ సెల్‌ఫోన్‌ టవర్‌ను ఏర్పాటు చేయించడంతో విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని కాణిపాకం పట్నం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పైగా ఈ భూమిని కబ్జా చేశాడని ఆరోపించారు. రేడియేషన్‌ కారణంగా యుగేష్‌ అనే విద్యార్థి మతిస్థిమితం లేకుండా పోయాడని వాపోయారు. విచారించి, న్యాయం చేయాలని కోరారు. ఫ తమను అప్కాస్‌లో చేర్చాలని ఏపీ ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌ కన్సాలిడేటెడ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేతలు కోరారు. పైగా ఆరు నెలలకు ఒకసారి జీతాలివ్వడంతో కుటుంబాలను పోషించడం కష్టంగా ఉందన్నారు. నేతలు శేఖర్‌, మోహన్‌బాబు, ప్రభాకర్‌, మురళికృష్ణ, నాగరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.  ఫ అంగన్‌వాడీ వ్యవస్థకు ప్రమాదకరంగా మారిన జీవో నెంబరు 172ను వెంటనే రద్దు చేయాలని ఏపీ అంగన్‌వాడీ, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు విన్నవించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య, జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు, నేతలు వాణిశ్రీ, శ్రీనివాసులు, రాజు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ వ్యవసాయ పనుల్లో యంత్రాలను నివారించాలంటూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజ్‌ మాట్లాడుతూ.. యంత్రాల వినియోగం వల్ల వ్యవసాయ కూలీలకు పనుల్లేకుండా పోతోందన్నారు. నేతలు సత్యమూర్తి, దాసరి చంద్ర, మణి, నాగరాజ్‌, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T06:51:20+05:30 IST