వైభవంగా దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-10-17T04:59:53+05:30 IST

దసరా నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంకాలమ్మ ఆలయం, అమ్మవారిశాల కన్యకాపరమేశ్వరీ, శ్రీపద్మావతి సమే త శ్రీవేంకటరమణస్వామి ఆలయంలో అమ్మవార్లు, శ్రీవారు తొమ్మిదిరోజులు పలు అలంకరణల్లో భక్తుల కు దర్శనమిచ్చారు.

వైభవంగా దసరా ఉత్సవాలు
మైదుకూరులో వసంతోత్సవంలో యువకులు

పులివెందుల టౌన్‌/పులివెందుల రూరల్‌/వేంపల్లె అక్టోబరు 13: దసరా నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంకాలమ్మ ఆలయం, అమ్మవారిశాల కన్యకాపరమేశ్వరీ, శ్రీపద్మావతి సమే త శ్రీవేంకటరమణస్వామి ఆలయంలో అమ్మవార్లు, శ్రీవారు తొమ్మిదిరోజులు పలు అలంకరణల్లో భక్తుల కు దర్శనమిచ్చారు. అంకాలమ్మ దేవస్థానంలో శుక్ర వారం విజయలక్ష్మిదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వ రస్వామికి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శని మిచ్చారు. కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవా రు విజయలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. 

కన్నులవిందుగా గ్రామోత్సవాలు

విజయదశమి రోజున పూలంగళ్ల సమీప పడమటి వీరాంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీరంగనాథ స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి గోవిందుని గ్రామోత్సవం, అంకాలమ్మ ఆలయం నుంచి  వైభవంగా సాగింది. 

 శిల్పారామంలో మూడు రోజులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరి రోజు శుక్రవారం నిర్వహించిన నృత్య ప్రదర్శనకు పెద్దఎత్తున ప్రజలు హాజరై తిలకించారు.  

వేంపల్లెలో పాన్పుసేవ

 దసరా పండుగను వేంపల్లెలో ఘనంగా చేసుకు న్నారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారిశాల లోని కన్యకాపరమేశ్వరీ దేవిని ఒక్కోరోజు ఒక్కో అ లంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శనివారం రాత్రి అమ్మవారికి పాన్పుసేవ నిర్వహిం చారు. వేంపల్లె పాపాఘ్ని నదీ ఒడ్డున వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహంతో ఊరేగిం పు నిర్వహించారు. భక్తులు శ్రీదేవి, భూదేవి సమేత వృషభాచలేశ్వరుడిని దర్శించుకున్నారు. 

చక్రాయపేటలో అమ్మవారి ఊరేగింపు

చక్రాయపేట, అక్టోబరు 16: చక్రాయపేటలో వెలసి న వేంకటేశ్వర, రాచరాయ దేవస్థానంలో శుక్రవారం అమ్మవారిని ఊరేగించారు. కొండప్పగారిపల్లె వాస్త వ్యులు భజన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమం లో బోర్డు మెంబర్లు, వివిధ గ్రామాల భక్తులు పా ల్గొన్నారు. అమ్మవారి ఊరేగింపు సందర్భంగా భక్తు లు టెంకాయలు కొట్టి, మొక్కులు తీర్చుకున్నారు. విజయదశమి సందర్భంగా రథోత్సవం, బాణ సం చా, మేళతాళాలతో ఊరేగించారు. మధ్యాహ్నం 1 గంట వరకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ఓబుళరెడ్డి, మాజీ చైర్మన్లు లాయర్‌ రామాంజులరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రామ చంద్రారెడ్డి, బోర్డు మెంబర్లు పాల్గొన్నారు.

పోరుమామిళ్లలో శ్రీవారి ఊంజల్‌ సేవ 

పోరుమామిళ్ల, అక్టోబరు 16: దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం రాత్రి శ్రీవారి ఊంజల్‌ సేవ నిర్వహించారు. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం లో శనివారం ఉదయం వసంతోత్సవం నిర్వహించారు. 

మైదుకూరులో వసంతోత్సవాలు

మైదుకూరు, అక్టోబరు 16: వసంతోత్సవం, అమ్మ వారికి పాన్పుసేవతో శరన్నవరాత్రోత్సవాలు ఘనం గా నిర్వహించారు. పట్టణంలోని అమ్మవారిశాల, పెద్దమ్మతల్లి, కోదండరామాలయం, మండలంలోని జీవీ సత్రంలోని అమ్మవార్లకు వివిధ అలంకారాలు చేస్తూ వచ్చారు. శుక్రవారం విజయదశమినాడు  అమ్మవార్లకు విజయలక్ష్మీ దేవి అలంకారం చేపట్టగా వాసవీమాత మూలవిరాట్టుకు రత్నాల చీరను అలంకరింపచేశారు. సాయంత్రం శమీదర్శనం, రా త్రికి అమ్మవారికి ప్రత్యేక పల్లకిలో  గ్రామోత్సవం నిర్వహించారు. యువకులు వసంతాలు చల్లుకుం టూ ఆర్యవైశ్యుల ఇళ్ల వద్ద  సంబరాలు చేసుకున్నారు.  

సాయిబాబా పుణ్యతిథి 

షీర్డీ సాయిబాబా విజయదశమి పుణ్యతిథిని శనివారం సాయినాథపురంలోని సాయిమందిరంలో వైభవంగా నిర్వహించారు. బాబా మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం నిర్వహించి, కుంకుమార్చన నిర్వహించారు.  స్వామివారి ఇష్టప్ర సాదాలు ఖవ్వా, జొన్నరొట్టె పప్పు పంపిణీ చేశారు. 

ముగిసిన దసరా ఉత్సవాలు

దువ్వూరు, అక్టోబరు 16: కన్యకాపరమేశ్వరీ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఆర్యవైశ్యులు వసంతాలు చలుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.











Updated Date - 2021-10-17T04:59:53+05:30 IST