Abn logo
Sep 28 2021 @ 10:41AM

తిరుమల తరహాలో ద్వారకా తిరుమల క్షేత్రం అభివృద్ధి: EO

ఏలూరు: ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు చినవెంకన్న ఆలయ ఈవో జీవి.సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల కార్యనిర్వహణాధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సచివాలయంలో సోమవారం సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ ఈవో సుబ్బారెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి సీఎంకు చినవెంకన్న జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వినియోగిస్తున్న టెక్నాలజీని అన్ని ప్రధాన ఆలయాల్లోనూ వినియోగంలోకి తేవాలని సూచించినట్లు ఈవో తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని సీఎం చెప్పినట్లు జీవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption