ద్వారకాతిరుమల చిన వెంకన్న కొండపై ఘోర అపచారం

ABN , First Publish Date - 2021-08-08T17:14:32+05:30 IST

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న శేషాచల కొండపై ఘోర అపచారం జరిగింది. దేవస్థానానికి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించి ఈ అపచారానికి పాల్పడ్డారు.

ద్వారకాతిరుమల చిన వెంకన్న కొండపై ఘోర అపచారం

ఏలూరు:  పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న శేషాచల కొండపై ఘోర అపచారం జరిగింది. దేవస్థానానికి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించి ఈ అపచారానికి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున అన్నదాన భవనం పక్కన గల పవర్ హౌస్ లో జంతుబలి పూజలు నిర్వహించారు. మేకపోతుకు దేవస్థానం ఇంజనీరింగ్ సెక్షన్  సిబ్బంది అగరొత్తుల ధూపం, పసుపు, కుంకుమ ,  వేపాకులతో  బలిపూజలు చేశారు. అలా పూజలు చేసిన మేకపోతుతో పవర్ హౌస్ చుట్టూ  మూడు సార్లు ప్రదక్షణలు చేయించారు. తర్వాత మేకపోతు చెవులు కోసి మొక్కులు చెల్లించారు.  అనంతరం మేకపోతును ఆటోలో అక్కడ నుంచి తరలించారు. విందు ఏర్పాటు చేసుకునేందుకే సిబ్బంది మేకపోతును బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీని వెనుక పాత్రధారులు ఎవరనే సందేహాలు భక్తుల్లో కలుగుతున్నాయి. ఆలయ ఈవోగా సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆలయంలో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈవో పర్యవేక్షణ లోపమే ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని కొందరు భక్తులు అభిప్రాయపడుతున్నారు. 





Updated Date - 2021-08-08T17:14:32+05:30 IST