ద్వారకా తిరుమల ఆలయం నివేదనశాల ఆధునీకరణ పనులు పరుగులు

ABN , First Publish Date - 2021-08-26T01:18:21+05:30 IST

ద్వారకా తిరుమల ఆలయం నివేదనశాల ఆధునీకరణ పనులు పరుగులు

ద్వారకా తిరుమల ఆలయం నివేదనశాల ఆధునీకరణ పనులు పరుగులు

పశ్చిమగోదావరి: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల వెంకన్న ఆలయంలో 30 లక్షల రూపాయలతో స్వామివారి నివేదనశాల ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నివేదనశాల పనులను ఆలయ చైర్మన్ యస్‌వి సుధాకర్‌రావు, ఈవో జీవీ సుబ్బారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి ఆలయానికి విచ్చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. 


రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఎంతో మహిమాన్విత క్షేత్రంగా భక్తుల చేత పూజలందుకుంటూ ఆలయ అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం శేషాచల కొండపై ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి నిత్యం స్వామివారికి మూడుసార్లు నివేదన చేస్తారు. ఆ నివేదన చేసే ప్రసాదాన్ని ప్రస్తుతం ఆలయ పడమర భాగాన వంటశాలలో తయారు చేస్తారు. అటువంటి నివేదనశాలను ఆధునీకరించాలని  ఆలయ ఈవో సుబ్బారెడ్డి ఆలోచన చేశారు. అనుకున్నదే తడవుగా 30 లక్షల రూపాయలు వ్యయంతో ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. నివేదనశాల ఆధునీకరణ పనులను ఈవో సుబ్బారెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఆధునీకరణ పనులు పరుగులు పెడుతున్నాయి.  త్వరలోనే  నివేదనశాల అందుబాటులోకి రానుంది.

Updated Date - 2021-08-26T01:18:21+05:30 IST