ద్వారకాతిరుమలలో ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు

ABN , First Publish Date - 2020-09-26T14:34:56+05:30 IST

ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో శనివారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు..

ద్వారకాతిరుమలలో ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు

ప.గో. జిల్లా: ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో శనివారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు అధిక ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ ఆలయంలో స్వామి, అమ్మవార్లను పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర్లుగా ముస్తాబు చేస్తారు. అలాగే 30వ తేదీన ఆలయంలో స్వామివారి కళ్యాణం జరగనుంది. కళ్యాణోత్సవాల రోజుల్లో స్వామి వారి నిత్య కళ్యాణాలు, నిత్య ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో డి.భ్రమరాంబ ప్రకటించారు.

Updated Date - 2020-09-26T14:34:56+05:30 IST