మహిళల హల్‌చల్‌

ABN , First Publish Date - 2021-10-25T05:18:11+05:30 IST

ద్వారకాతిరుమల ఆలయ వీఐపీ గెస్ట్‌హౌస్‌ వద్ద విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు నేలపై బైఠాయించి హల్‌చల్‌ చేశారు.

మహిళల హల్‌చల్‌
వీఐపీ గెస్ట్‌హౌస్‌ వద్ద బైఠాయించిన మహిళలు

ద్వారకా తిరుమలలో వీఐపీ గెస్ట్‌హౌస్‌ వద్ద ఇద్దరు మహిళల బైఠాయింపు

ఈవో బయటకు రావాలంటూ నినాదాలు


ద్వారకా తిరుమల, అక్టోబరు 24: ద్వారకాతిరుమల ఆలయ వీఐపీ గెస్ట్‌హౌస్‌ వద్ద విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు నేలపై బైఠాయించి హల్‌చల్‌ చేశారు. సుమారు గంటసేపు అక్కడే ఉండి ఈవో బయటకు వచ్చి తమతో మాట్లాడాలి అంటూ నేలపై కూర్చున్నారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళలకు నచ్చజెప్పేప్రయత్నం చేశారు. ఈవో వచ్చి తమతో మాట్లాడితేకానీ తాము ఇక్కడి నుంచి వెళ్లేదిలేదంటూ మహిళలు భీష్మించారు. ఆలయ ఈవో సుబ్బారెడ్డి గంటసేపైనా బయటకు రాలేదు. ఇక్కడ ఎందుకు నిరసన తెలుతున్నారని మహిళలను పోలీసులు ప్రశ్నించారు. అది మీకు చెప్పేది కాదని, ఈవో బయటకు వస్తే ఆయనతో తేల్చుకుంటామని తెగేసి చెప్పడంతో వెనక్కి తగ్గారు. అయితే ఈ లోపు ఆ మహిళలకు ఫోన్‌ రావడంతో అక్కడి నుంచి హడావుడిగా బయటకు వచ్చారు. మహిళలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తాము వచ్చిన సమస్య మీతో చెబితే తీరదని, తాము వెనుతిరిగి విజయవాడ వెళ్లిపోతున్నామని, ఈవో సుబ్బారెడ్డి విజయవాడ వచ్చి తమకు సమాధానం చెబుతాడని బదులిచ్చి వెళ్లిపోయారు. ఈ మహిళలు కాంట్రాక్టర్లకు చెందిన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై ఈవో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Updated Date - 2021-10-25T05:18:11+05:30 IST