బ్రావో అవుట్‌

ABN , First Publish Date - 2020-10-22T08:50:15+05:30 IST

ఐపీఎల్‌లో వరుస ఓటములతో ప్లేఆ్‌ఫ్సకు దాదాపుగా దూరమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గజ్జల్లో గాయం...

బ్రావో అవుట్‌

దుబాయ్‌: ఐపీఎల్‌లో వరుస ఓటములతో ప్లేఆ్‌ఫ్సకు దాదాపుగా దూరమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గజ్జల్లో గాయం కారణంగా  ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో లీగ్‌కు దూరమయ్యాడని చెన్నై సీఈవో కాశీ విశ్వనాథన్‌ తెలిపాడు. గత శనివారం ఢిల్లీతో మ్యాచ్‌ మధ్యలో బ్రావో గాయంతో మైదానం వీడాడు. మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన బ్రావో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏడు పరుగులు చేసి.. ఆరు వికెట్లు పడగొట్టాడు.

Updated Date - 2020-10-22T08:50:15+05:30 IST