ముగిసిన 'ఈ-పరిపాలన పై ఏర్పాటైన 24 వ జాతీయ సదస్సు'

ABN , First Publish Date - 2022-01-08T22:08:21+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్ర పరిపాలనా సంస్కరణల శాఖ, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ-పరిపాలనపై రెండు రోజుల పాటు నిర్వహించిన రెండు రోజుల 24వ జాతీయ సాస్ విజయవంతంగా ముగిసింది.

ముగిసిన 'ఈ-పరిపాలన పై ఏర్పాటైన 24 వ జాతీయ సదస్సు'

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్ర పరిపాలనా సంస్కరణల శాఖ, ఎలక్ట్రానిక్స్  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ-పరిపాలనపై రెండు రోజుల పాటు నిర్వహించిన రెండు రోజుల 24వ జాతీయ సాస్ విజయవంతంగా ముగిసింది. 'మహమ్మారి తర్వాత నెలకొన్న పరిస్థితిలో డిజిటల్ పరిపాలన :భారతదేశంలో పరిస్థితి' అనే అంశంపై సదస్సును నిర్వహించారు. శనివారం జరిగిన సదస్సు ముగింపు సమావేశంలో 'హైదరాబాద్ డిక్లరేషన్' ను ఆమోదించారు.రెండు రోజుల విస్తృత చర్చల తరువాత సదస్సు ‘ హైదరాబాద్ డిక్లరేషన్' ను ఏకగ్రీవంగా ఆమోదించింది.సదస్సును కేంద్ర శాస్త్ర సాంకేతిక (సహాయ), అంతరిక్ష మంత్రిత్వ ( స్వతంత్ర) శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ప్రారంభ సమావేశం తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె టి రామారావు  అధ్యక్షతన జరిగింది.


ఈ-పరిపాలనను మరింత సమర్థంగా అమలు చేయాల్సిన ఆధునిక తాజా సాంకేతిక అంశాలను సమగ్రంగా ఈ-పరిపాలనపై జరిగిన 24 వ జాతీయ సదస్సులో నిపుణులు చర్చించారు. సదస్సులో ప్రసంగించిన నిపుణులు సదస్సు ఇతివృతంపై తమ అనుభవాలను, అభిప్రాయాలను వివరంగా వెల్లడించారు.ఈ-పరిపాలనను అమలు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై సదస్సులో పాల్గొన్న వివిధ రాష్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు స్పష్టమైన అవగాహనకు వచ్చారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని అమలు చేసేందుకు అవకాశం కలుగుతుంది.రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో ఆరు అంశాలపై విడివిడిగా చర్చలు జరిగాయి,


ఆత్మ నిర్భర్ భారత్, ప్రభుత్వ సేవలను ప్రజలందరికి అందుబాటులోకి తేవడం, సుపరిపాలకు సాంకేతికతను జోడించి ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ప్రభుత్వ విధానాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం, భారత దేశ టెకాడే- డిజిటల్ ఆర్థిక వ్యవస్థ (డిజిటల్ చెల్లింపులు-ప్రజల విశ్వాసం)పై నిపుణులు చర్చలు జరిపారు. దీనికి సమాంతరంగా జరిగిన సమావేశాల్లో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఈ-పరిపాలన అంశంలో అవార్డులు సాధించిన వ్యక్తులు తమ అనుభవాలు, అవార్డు సాధించిన తమ పనులను వివరించారు. ఈ-పరిపాలనలో భారతదేశం సాధించిన విజయాలు, ప్రగతిపై ప్రత్యేక ప్రదర్శనను సదస్సు సందర్భంగా ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై 50 మందికి పైగా నిపుణులు పత్రాలను సమర్పించారు. సదస్సుకు 2000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. 

Updated Date - 2022-01-08T22:08:21+05:30 IST