హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఈ-బోర్డింగ్‌ సదుపాయం

ABN , First Publish Date - 2020-10-28T08:14:47+05:30 IST

జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానా శ్రయం ప్రయాణికులకు మరో సదుపాయా న్ని అందుబాటులోకి తెచ్చింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ-బోర్డింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది...

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఈ-బోర్డింగ్‌ సదుపాయం

హైదరాబాద్‌ : జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానా శ్రయం ప్రయాణికులకు మరో సదుపాయా న్ని అందుబాటులోకి తెచ్చింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ-బోర్డింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి  తెచ్చింది. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి మాత్రమే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఇలాంటి సదుపాయం అందుబాటులో ఉందని జీఎంఆర్‌ గ్రూప్‌ తెలిపింది. ఈ నెల 2న  షార్జా వెళ్లే ఇండిగో విమా న ప్రయాణికులతో ఎయిర్‌పోర్టు ఈ  కార్యక్రమం ప్రారంభించింది. త్వరలో మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఈ సదుపాయాన్ని విస్తరించబోతోంది. దేశీయ ప్రయాణికులకు హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఎప్పటి నుంచో ఈ-బోర్డింగ్‌ సదుపాయం అందుబాటులో ఉంది. 


Updated Date - 2020-10-28T08:14:47+05:30 IST