ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు ఈ-బోర్డింగ్ సౌకర్యం

ABN , First Publish Date - 2021-02-23T21:45:08+05:30 IST

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల కోసం ఈ-బోర్డింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు ఈ-బోర్డింగ్ సౌకర్యం

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల కోసం ఈ-బోర్డింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఇండిగో, గోఎయిర్ ఎయిర్‌లైన్ల ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా.. సోమవారం నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ద్వారా దుబాయ్ తదితర నగరాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా దీన్ని అమలు చేస్తున్నట్లు తెలియజేసింది. కాగా, దేశంలో ఈ తరహా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన తొలి విమానాశ్రయంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నిలిచింది. ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా కార్యక్రమాల స్ఫూర్తితోనే ఈ కాగితరహిత ఈ-బోర్డింగ్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టు విమానాశ్రయ సీఈఓ ప్రదీప్ పణికర్ వెల్లడించారు. ఈ-బోర్డింగ్‌లో భాగంగా ప్రయాణికులకు కాగితరహిత పాసులు కేటాయించడం జరుగుతుంది. అలాగే పాసుల కోసం ప్రయాణికులు గంటలతరబడి నిరీక్షించాల్సిన అవసరం కూడా ఉండదు. 

Updated Date - 2021-02-23T21:45:08+05:30 IST