ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐ నిబంధనలు సరళీకరించాలి: ఐఎస్‌బీ

ABN , First Publish Date - 2021-11-25T08:53:44+05:30 IST

దేశీయ ఈ-కామర్స్‌ వ్యాపారంలో విదేశీ కంపెనీలు అడుగు పెట్టేందుకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు..

ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐ నిబంధనలు సరళీకరించాలి: ఐఎస్‌బీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశీయ ఈ-కామర్స్‌ వ్యాపారంలో విదేశీ కంపెనీలు అడుగు పెట్టేందుకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు నిబంధనలను సరళీకరించాల్సిన అవసరం ఉందని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) పేర్కొంది. దేశంలోని ఆన్‌లైన్‌ రిటైల్‌ వ్యాపారంపై ఏడాది పాటు అధ్యయనం చేసి ఐఎస్‌బీకి చెందిన భారతీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఒక నివేదికను తయారు చేసింది. ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐల ప్రవేశానికి సంబంధించిన నిబంధనలు సంక్ష్లిష్టంగా ఉన్నాయని, వాటిని సరళీకరించాల్సిన అవసరం ఉందని నివేదికలో తెలిపింది. ఈ-కామర్స్‌ రంగాన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

Updated Date - 2021-11-25T08:53:44+05:30 IST