ఫన్నీ వీడియో: లైవ్‌షోలో కుక్క వెనుక పెరిగేత్తుకుంటూ వెళ్లిన యాంకర్!

ABN , First Publish Date - 2021-04-04T00:21:26+05:30 IST

పెంపుడు కుక్కులు, పిల్లులు ఇంటిన పడి ఎంత అల్లరి చేస్తాయో అవి పెంచుకునే వారికి బాగా తెలుసు. వాటిపై ఉండే ఆపేక్షతో కొందరు వాటి అల్లరిని రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటారు. అటువంటివి తెగ వైరల్ అవుతుంటాయి కూడా. ఇక రష్యాలో ఓ కుక్కు చేసిన తుంటరి పని కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

ఫన్నీ వీడియో: లైవ్‌షోలో కుక్క వెనుక పెరిగేత్తుకుంటూ వెళ్లిన యాంకర్!

ఇంటర్నెట్ డెస్క్: పెంపుడు కుక్కులు, పిల్లులు ఇంటినపడి ఎంత అల్లరి చేస్తాయో అవి పెంచుకునే వారికి బాగా తెలుసు. వాటిపై ఉండే ఆపేక్షతో కొందరు వాటి అల్లరిని రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటారు. అటువంటివి తెగ వైరల్ అవుతుంటాయి కూడా. ఇక రష్యాలో ఓ కుక్కు చేసిన తుంటరి పని కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. మీర్ టీవీ యాంకర్ నెడెస్తా సెర్జెకీనా వాతావరణానికి సంబంధించి వీధిలో నిలబడి లైవ్ అప్‌డేట్ ఇస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలీదు కానీ.. ఓ కుక్కు ఒక్కసారిగా యాంకర్‌పైకి ఎగిరి ఆమె దుస్తులకు తగిలించి ఉన్న మైక్రోఫోన్‌ను ఎత్తుకుపోతుంది. 


దీంతో షాకైన యాంకర్ లైవ్ షో విషయం మర్చిపోయి కుక్క వెనకాల పరిగెత్తుకుంటూ కొంత దూరం వెళ్లిపోతుంది. ఆ తరువాత కుక్కు ఆపి.. మైక్రోఫోన్ తీసుకుంటుంది. ఆ వెంటనే..మళ్లీ ప్రేక్షకులనుద్దేశించి మాట్లాడిన యాంకర్.. మైక్రోఫోన్ కాస్తంత దెబ్బతిందని చెబూతూ కుక్క మాత్రం బాగానే ఉందని ముగిస్తుంది. కాగా..అక్కడున్న కెమెరామెన్ ఇదంతా రికార్డు చేస్తూనే ఉండటంతో ఈ దృశ్యాలన్నీ లైవ్‌లో ప్రసారమైన టీవీ ప్రేక్షకులను పొట్టుచెక్కలయ్యేలా నవ్వించాయి. ఆ తరువాత..ఈ వీడియో సోషల్ మీడియా బాట పట్టి అక్కడ కూడా నవ్వులు పూయించింది. ప్రస్తుతం ప్రపంచాన్ని కడుపుబ్బా నవ్విస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్యేయండి..!



Updated Date - 2021-04-04T00:21:26+05:30 IST