ఈ-గోల్డ్‌లో పెట్టుబడికి మార్గాలు

ABN , First Publish Date - 2020-11-22T06:35:50+05:30 IST

బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు లోహం కొనుగోలు చేసే బదులు ఎలకా్ట్రనిక్‌ మార్గాలను ఎంచుకోవడం మేలని ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే, ఆభరణం కొనుగోలు చేస్తే తయారీ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బంగారం విక్రయించే సమయంలో తరుగు లెక్కిస్తారు...

ఈ-గోల్డ్‌లో పెట్టుబడికి మార్గాలు

బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు లోహం కొనుగోలు చేసే బదులు ఎలకా్ట్రనిక్‌ మార్గాలను ఎంచుకోవడం మేలని ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే, ఆభరణం కొనుగోలు చేస్తే తయారీ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బంగారం విక్రయించే సమయంలో తరుగు లెక్కిస్తారు. బంగారు నాణేలు, బిస్కెట్‌ కొనుగోలు చేసినా వాటిని భద్రపర్చడం సమస్యే. బ్యాంక్‌ లాకర్లో దాచినా.. అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఎలకా్ట్రనిక్‌ గోల్డ్‌ విషయానికొస్తే.. పెట్టుబడే కాదు, అవసరమైనప్పుడు సొమ్ము ఉపసంహరించుకోవడమూ సులువే. ఇందుకున్న మార్గాలు.. 



గోల్డ్‌ ఈటీఎఫ్‌ 

బంగారం ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు(ఈటీఎ్‌ఫ)లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే ఈక్విటీ షేర్ల వంటివే. వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు డీమ్యాట్‌ అకౌంట్‌, ట్రేడింగ్‌ అకౌంట్‌  అవసరం. షేర్ల తరహాలోనే మనకు కావాల్సినప్పుడు వీటి నుంచి పెట్టుబడులు విత్‌డ్రా చేసుకోవచ్చు. గోల్డ్‌ ఈటీఎ్‌ఫలు ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన సొమ్మును బంగారు లోహం  లేదా డెట్‌ పథకాల్లో పెట్టుబడి పెడతాయి. 


గోల్డ్‌ ఫండ్స్‌ 

మ్యూచువల్‌ ఫండ్ల మాదిరిగానే గోల్డ్‌ ఫండ్లలోనూ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఫండ్‌ మేనేజర్లు వీటిని నిర్వహిస్తారు. ఈ ఫండ్ల ద్వారా సేకరించిన సొమ్మును మేనేజర్లు గోల్డ్‌, సంబంధిత సేవల కంపెనీల షేర్లలో పెట్టుబడిగా పెడతారు. 


గోల్డ్‌ మైనింగ్‌ షేర్లు 

ఈక్విటీ మార్కెట్లో గోల్డ్‌ మైనింగ్‌ షేర్లలోనూ పెట్టుబడులు పెట్టవచ్చు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఈ షేర్ల ధరలూ మారుతుంటాయి. 


గోల్డ్‌ డెరివేటివ్స్‌ 

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌(ఎంసీఎక్స్‌)లో ట్రేడయ్యే గోల్డ్‌ ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల్లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు. ఇవి ఇతర డెరివేటివ్‌ కాంట్రాక్టుల్లాంటివే. 


ప్రభుత్వ పసిడి బాండ్లు 

కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ వీటిని జారీ చేస్తుంది. ఈ పథకంలో కనీసం ఒక గ్రాము కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏడాది మొత్తంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు(హెచ్‌యూఎఫ్‌) 4 కేజీల  వరకు కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు, యూనివర్సిటీలు, చారిటీ సంస్థలు 20 కిలోల వరకు కొనేందుకు వీలుంటుంది. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు. ఐదు సంవత్సరాలు పూర్తయ్యాక పెట్టుబడులను ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది. 


గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ 

వీటిని గోల్డ్‌ సేవింగ్‌ ఫండ్‌ అని కూడా అంటారు. ఈ మ్యూచువల్‌ ఫండ్లు ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన సొమ్మును గోల్డ్‌ ఈటీఎ్‌ఫల్లో పెట్టుబడిగా పెడతాయి. నేరుగా గోల్డ్‌       ఈటీఎ్‌ఫల్లో ఇన్వెస్ట్‌ చేయదలుచుకోని వారు వీటిని ఎంచుకోవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టేందుకు డీమ్యాట్‌  అకౌంట్‌ కూడా అవసరం లేదు. 






  • ఎంసీఎక్స్‌ డేటా ప్రకారం గడిచిన 9 తొమ్మిదేళ్లలో గోల్డ్‌ రిటర్నులు 


Updated Date - 2020-11-22T06:35:50+05:30 IST