అందుబాటులోకి ఈ-ఎపిక్‌ సేవలు

ABN , First Publish Date - 2021-01-26T06:29:56+05:30 IST

ఎలక్ర్టానిక్‌ ఎలక్టోరల్‌ ఫొటో ఐడెంటిటీ కార్డ్‌

అందుబాటులోకి ఈ-ఎపిక్‌ సేవలు

మొబైల్‌లో ఓటర్‌ గుర్తింపు కార్డు 8 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఎలక్ర్టానిక్‌ ఎలక్టోరల్‌ ఫొటో ఐడెంటిటీ కార్డ్‌ (ఈ-ఎపిక్‌) సేవలు అందుబాటులోకి వచ్చాయి. 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం ఈ-ఎపిక్‌ సేవలను జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులతో ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేశారు. మొబైల్‌ యాప్‌తో ఈ-ఎపిక్‌ను పొందే అవకాశముంది. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎ్‌సఆర్‌)-2021లో భాగంగా ఇటీవల విడుదల చేసిన జాబితాలో కొత్తగా పేర్లు నమోదైన వారు ఈ నెల 31 వరకు ఓటర్‌ గుర్తింపు కార్డు తీసుకునే అవకాశముంది. ఫిబ్రవరి 1 నుంచి ఓటర ్లందరూ యాప్‌/పోర్టల్‌ ద్వారా గుర్తింపు కార్డులు పొందవచ్చు. పీడీఎ్‌ఫలో డౌన్‌లోడ్‌ చేసుకునే గుర్తింపు కార్డును ఫోన్‌లో భద్రపర్చుకోవచ్చు. ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు. http://nvsp.in లేదా http://voterportal.eci.gov.in ద్వారా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఉన్న మొబైల్స్‌లోనూ ఈ-ఎపిక్‌ కార్డు తీసుకోవచ్చు. హైదరాబాద్‌ ఓటర్లు ఈ-ఎపిక్‌ కార్డు సేవలను వినియోగించుకోవాలని లోకే్‌షకుమార్‌ సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు జయరాజ్‌ కెనడి, ఎస్‌. పంకజ, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-26T06:29:56+05:30 IST