రేపటినుంచే... ‘ఈ- రూపి’...బ్యాంకు ఖాతా కూడా లేకుండానే

ABN , First Publish Date - 2021-08-01T22:38:35+05:30 IST

నగదురహిత లావాదేవీల కోసం కేంద్రప్రభుత్వం కొత్త ‘చెల్లింపుల విధానం’ను ప్రవేశపెట్టబోతోందన్న విషయం తెలిసిందే.

రేపటినుంచే... ‘ఈ- రూపి’...బ్యాంకు ఖాతా కూడా లేకుండానే

న్యూఢిల్లీ : నగదురహిత లావాదేవీల కోసం కేంద్రప్రభుత్వం కొత్త ‘చెల్లింపుల విధానం’ను ప్రవేశపెట్టబోతోందన్న విషయం తెలిసిందే. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఈ కొత్త ప్రక్రియ... సోమవారం నుంచి అందుబాటులో రానుంది.  డిజిటల్ లావాదేవీల కోసం ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు, అమెజాన్ పే, పేటీఎం వంటి వ్యవస్థలున్నాయి.


ఇక వీటితో అవసరం లేకుండా... ‘నగదురహిత లావాదేవీ’ల కోసం కేంద్రం కొత్త విధానాన్ని అందుబాటులో తీసుకురానుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కొత్త విధానాన్ని రూపొందించింది. అదే... ‘ఈ  రూపి’. ఈ క్రమంలో... నగదు చెల్లింపులను క్యూ ఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ ఓచర్ ద్వారా లబ్దిదారుడి మొబైల్ పోన్‌కు జరుపుతారు. ఈ ఓచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్దిదారుడు తనకు అవసరమైనచోట వినియోగించుకోవచ్చు. డిజిటల్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ‘ఈ-రూపి’ విధానం అమల్లోకి రానుంది.


రేపటినుంచి అందుబాటులోకి రానున్న ఈ కొత్త విధానం తొలిదశలో... కేంద్రం నుంచి ఆర్ధికసాయం పొందే లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సహాయం అందుతుంది. మొబైల్ ఫోన్‌కు క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ ఓచర్ రూపంలో నగదు అందుతుంది. అయితే... వీటి వినియోగం విషయంపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. 

Updated Date - 2021-08-01T22:38:35+05:30 IST