వేధించాలంటే వేధించుకోవచ్చని చెప్పాం: ఖర్గే

ABN , First Publish Date - 2021-12-07T00:12:55+05:30 IST

విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్సన్‌ను‌‌ ఎత్తివేయాలనే డిమాండ్‌పై రాజ్యసభలో గందరగోళం..

వేధించాలంటే వేధించుకోవచ్చని చెప్పాం: ఖర్గే

న్యూఢిల్లీ: విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్సన్‌ను‌‌ ఎత్తివేయాలనే డిమాండ్‌పై రాజ్యసభలో గందరగోళం కొనసాగుతుండటం, సభాకార్యక్రమాలు పదేపదే వాయిదా పడుతుండంపై రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆదివారంనాడు సూటిగా స్పందించారు. సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవడానికి ఆయన (చైర్మన్) ఇష్టపడటం లేదని, ప్రజాస్వామ్యంలో ఎంతకాలం విపక్షాలను దూరంగా ఉంచుతారని ఖర్గే నిలదీశారు.


''సభా కార్యక్రమాలు సజావుగా సాగడం, సాగకపోవడం అనేది ఆయన (చైర్మన్) చేతిలో ఉంటుంది. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆయన మా షరతులు అంగీకరించాలి. మమ్మల్ని వేధించాలని అనుకుంటే వేధించుకోవచ్చని కూడా ఆయనకు చెప్పాం. ఛాయెస్ ఆయన చేతిల్లోనే ఉంది. మేము కోరుతున్నది ఒకటే. ఎంపీల సస్పెన్షన్ నిర్ణయంపై పునరాలోచించాలని, సభా కార్యక్రమాలను సజావుగా సాగేలా చూడాలని కోరుతున్నాం. రాజ్యసభ పదేపదే వాయిదా పడుతూ వస్తోంది. ఎంపీల సస్పెన్షన్ రద్దు చేయాలని విపక్షాలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి'' అని ఖర్గే పేర్కొన్నారు.

Updated Date - 2021-12-07T00:12:55+05:30 IST