ఎంసెట్ సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
ABN , First Publish Date - 2021-10-23T01:11:25+05:30 IST
తెలంగాణలో ఎంసెట్ సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను అధికారులు
హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేసారు. ఈ నెల 25 నుంచి తుది విడత అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. నవంబర్ 2న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. సీట్ల రద్దుకు నవంబర్ 7 వరకు అవకాశం ఇచ్చారు. నవంబర్ 6 వరకు ఆన్లైన్లో రిపోర్టింగ్కి అవకాశం కల్పించారు. నవంబర్ 9 నుంచి స్పెషల్ రౌండ్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 12న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. నవంబర్ 15 లోపు సీటు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీలో ఆన్లైన్ రిపోర్ట్ చేయాలని అధికారులు పేర్కొన్నారు.