కాంగ్రెస్‌ నాయకుల ముందస్తు అరెస్టు

ABN , First Publish Date - 2022-07-22T05:10:13+05:30 IST

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారణ పేరుతో ఇ బ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌ నుంచి ఈడీ కార్యాలయం వరకు నిర్వహించే ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న నారాయణపేట కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

కాంగ్రెస్‌ నాయకుల ముందస్తు అరెస్టు
పేట పీఎస్‌లో అరెస్టు అయిన కాంగ్రెస్‌ నాయకులు

నారాయణపేట, జూలై 21 : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారణ పేరుతో ఇ బ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌ నుంచి ఈడీ కార్యాలయం వరకు నిర్వహించే ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న నారాయణపేట కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా ర్యాలీ, ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చే యడాన్ని ఖండించారు. కేంద్ర ప్రభుత్వం సోనియా, రాహుల్‌లను రాజకీయంగా దెబ్బతీయాలని ఈడీ విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న వ్యతిరేక విధా నాలను నిరసిస్తూ వచ్చే గాంధీ జయంతి రోజు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 3500 కి.మీ. భారత్‌ ఏకతా జోడో పాదయాత్ర కొనసాగుతుంద న్నారు. కాంగ్రెస్‌ నాయకులు రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్‌ సలీం, లిఖి రఘు, శరణప్ప, మహిమూద్‌ ఖురేషి, యూసూఫ్‌ తాజ్‌, విజయ్‌, సమీర్‌ బేగ్‌ అరెస్టు అయిన వారిలో ఉన్నారు.

మక్తల్‌ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడీ అక్రమ కేసులు బనాయించడం సరి కాదని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బి.నర్సిములు, పట్టణ అధ్యక్షుడు రవికుమార్‌ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్‌ నాయకుడు శ్రీహరి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించి అవకతవకలు, ఆర్థిక లావాదేవీలు జరిగాయని కుట్రపూరితంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా అక్రమంగా కేసులు పెట్టించి నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు. మండలా ధ్యక్షుడు గణేష్‌, నాయకులు రవికుమార్‌, నూరు  ద్దీన్‌, నరేందర్‌, గోవర్ధన్‌ పాల్గొన్నారు. 

దామరగిద్ద : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాకు వెళ్లకుండా గురువారం స్థానిక పోలీసులు కాంగ్రెస్‌ నాయకులను అరెస్ట చేశారు. మండల నాయకుడు బాల్‌రెడ్డి మాట్లాడుతూ సోనియా, రాహుల్‌ గాంధీలను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఈడీ విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అనంతరం వ్యక్తిగత పూచిపై విడిచి పెట్టారు. నాయకులు శరణ్‌ నాయక్‌, శ్రీనివాస్‌, వెంకటప్ప, అంజప్ప అరెస్టు అయిన వారిలో ఉన్నారు. 

మరికల్‌ :  ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న మరికల్‌ మండల కాంగ్రెస్‌ నాయకులను గురువారం ఎస్‌ఐ అశోక్‌బా బు ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తర లించారు. కాంగ్రెస్‌ నాయకుడు గొల్ల కృష్ణయ్య మా ట్లాడుతూ కేంద్రం కాంగ్రెస్‌ నాయకులపై కక్ష సాఽ ధింపు చర్యలు మానుకోవాలన్నారు. వీరన్న, రవి, మొగ్గులప్ప, మల్లేష్‌, చెన్నయ్య పాల్గొన్నారు.

నేడు పోస్టాఫీస్‌ ముందు ధర్నా

డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నారాయణపేట పోస్టాఫీస్‌ ముందు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు గురువారం కాంగ్రెస్‌ నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కేంద్ర ప్రభుత్వం ఈడీ విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టాల నే పిలుపు మేరకు ఈ ధర్నాకు పిలుపు నివ్వడం జరిగిందన్నారు. ఈ ధర్నాలో యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు చిట్టెం అభిజయ్‌రెడ్డి పాల్గొంటారని నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. 




Updated Date - 2022-07-22T05:10:13+05:30 IST