Corona Third wave.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ కీలక వ్యాఖ్య

ABN , First Publish Date - 2021-07-15T19:43:46+05:30 IST

ప్రపంచం ప్రస్తుతం కరోనా మూడో వేవ్ తొలిదశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధానమ్ గురువారం హెచ్చరించారు.

Corona Third wave..  డబ్ల్యూహెచ్ఓ చీఫ్ కీలక వ్యాఖ్య

జెనీవా: పలు దేశాల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి పెరుగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ గురువారం నాడు కీలక వ్యాఖ్య చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ..మనం ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ తొలి దశలో ఉన్నాం’’ అని హెచ్చరించారు. అంతకుమునుపు..కరోనా వ్యాప్తికి సంబంధించి టెడ్రోస్ పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టకపోవడం, ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు. కొద్ది కాలం క్రితం టీకాకరణ కారణంగా ఐరోపా అంతటా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చిందని, ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు వ్యతిరేకదిశలో వెళుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వైరస్‌లో పలు మార్పులు వస్తుండటంతో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని టెడ్రోస్ పేర్కొన్నారు. ఇప్పటికే 111 దేశాల్లో కాలు పెట్టిన డెల్టా వేరియంట్ రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తమవుతుందని హెచ్చరించారు. డెల్లా వేరియంట్‌ కారణంగా కరోనా థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-07-15T19:43:46+05:30 IST