ఇండోనేషియాలో భూకంపం...సునామీ ముప్పు లేదు...

ABN , First Publish Date - 2020-03-27T12:57:28+05:30 IST

ఒకవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుండగా, మరోవైపు శుక్రవారం ఉదయం ఇండోనేషియా దేశంలో భూకంపం సంభవించింది....

ఇండోనేషియాలో భూకంపం...సునామీ ముప్పు లేదు...

జకార్తా (ఇండోనేషియా): ఒకవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుండగా, మరోవైపు శుక్రవారం ఉదయం ఇండోనేషియా దేశంలో భూకంపం సంభవించింది. ఇండోనేషియా తూర్పున ఉన్న పాపువా ప్రావిన్సు పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున 4.36 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9 అని ఇండోనేషియా మెట్రోలాజీ అండ్ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. జకార్తాకు 72 కిలోమీటర్ల దూరంలోని జయపురా జిల్లాలో సంభవించిన ఈ భూకంపం 11 కిలోమీటర్ల లోతులో వచ్చింది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి సునామీ ముప్పు లేదని ఇండోనేషియా సర్కారు వెల్లడించింది. 

Updated Date - 2020-03-27T12:57:28+05:30 IST