భూ రీసర్వే భవిష్యత్‌ తరాలకు దిక్సూచి

ABN , First Publish Date - 2021-10-27T07:15:00+05:30 IST

ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే భవిష్యత్‌ తరాలకు దిక్సూచిగా పనిచేస్తుందని రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్‌, ల్యాండ్‌ రికార్డుల కమిషనర్‌ సిద్ధార్థజైన్‌ అన్నారు.

భూ రీసర్వే భవిష్యత్‌ తరాలకు దిక్సూచి
సమావేశంలో ప్రసంగిస్తున్న సిద్ధార్థజైన్‌

రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్‌, ల్యాండు రికార్డుల కమిషనర్‌


చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 26: ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే భవిష్యత్‌ తరాలకు దిక్సూచిగా పనిచేస్తుందని రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్‌, ల్యాండ్‌ రికార్డుల కమిషనర్‌ సిద్ధార్థజైన్‌ అన్నారు. మంగళవారం చిత్తూరుకు వచ్చిన ఆయన కలెక్టరేట్‌లోని జేసీ మీటింగ్‌ హాలులో అధికారులు, సిబ్బందితో రీ సర్వేపై సమీక్షించారు. సర్వేలో తలెత్తే ఇబ్బందులకు పరిష్కారాలను సూచించారు. పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న నాలుగు గ్రామాల్లో ఈనెల 29న డ్రాప్ట్‌ల్యాండ్‌ రిజిస్టర్లు పూర్తిచేసి, నోటిఫికేషన్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ హరినారాయణన్‌, జేసీ రాజాబాబు, సర్వే శాఖ ఏడీ జయరాజ్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు ఫర్వీన్‌, కోదండరామిరెడ్డి, తహసీల్దార్ల, సర్వేయర్లు, డివిజనల్‌ డిప్యూటీ సర్వేయర్లు, సర్వే ఇన్స్‌పెక్టర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T07:15:00+05:30 IST