భూ ప్రకంపనలు...

ABN , First Publish Date - 2020-06-05T18:30:54+05:30 IST

దేశవ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి భూ ప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్నాటకలతో పాటు పలు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఈ ప్రకంపనల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ళ బయటకు పరుగులు తీశారు.

భూ ప్రకంపనలు...

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి భూ ప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్నాటకలతో పాటు పలు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఈ ప్రకంపనల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ళ బయటకు పరుగులు తీశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవన్, శర్మ కళాశాల పరిసరాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జార్ఖండ్ లోని జంషెడ్‌పూర్‌లో ఒకింత తీవ్రంగా ప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు. ఇక్కడ రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 4.7 గా నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇక కర్నాటకలోని హంపిలో చోటుచేసుకున్న భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై నాలుగుగా నమోదైంది. 

Updated Date - 2020-06-05T18:30:54+05:30 IST