Abn logo
Sep 22 2021 @ 07:12AM

అండమాన్,నికోబార్ దీవులు, ఆస్ట్రేలియాల్లో భూకంపం

పోర్ట్‌బ్లెయిర్ : అండమాన్, నికోబార్ దీవుల్లో మంగళవారం రాత్రి భూకంపం సంభవించింది. అండమాన్, నికోబార్ దీవుల్లో మంగళవారం రాత్రి 11.45 గంటలకు సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. పోర్ట్‌బ్లెయిర్ పట్టణానికి 202 కిలోమీటర్ల దూరం 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు చెప్పారు. ఈ నెల 11వతేదీన అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో తరచూ సంభవిస్తున్న భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.ఆస్ట్రేలియా దేశంలోని దక్షిన మౌంట్ బుల్లర్ ప్రాంతంలోని విక్టోరియాలో భూకంపం సంభవించింది. 

మెల్ బోర్న్ నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది.భూప్రకంపనలతో మెల్ బోర్న్, విక్టోరియా ప్రాంతాల్లోని ప్రజలు కలవరపడ్డారు. భూకంపం వల్ల పలు భవనాలు, అపార్టుమెంట్లు దెబ్బతిన్నాయి. భూకంపం వల్ల భవనాలు దెబ్బతింటే వెంటనే సమాచారం అందించాలని విక్టోరియా స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ ట్వీట్ లో కోరింది.

ఇవి కూడా చదవండిImage Caption