లద్దాఖ్‌లో మళ్లీ భూకంపం..భయాందోళనల్లో జనం

ABN , First Publish Date - 2020-09-26T11:40:33+05:30 IST

జమ్మూకశ్మీరులోని లద్దాఖ్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది....

లద్దాఖ్‌లో మళ్లీ భూకంపం..భయాందోళనల్లో జనం

 లద్దాఖ్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని లద్దాఖ్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున 2.14 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలు చెందారు.ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ,ఆస్తినష్టం సంభవించకున్నా వరుసగా లద్దాఖ్ లో సంభవిస్తున్న భూకంపాలతో ప్రజలు కలవర పడుతున్నారు.శుక్రవారం మధ్యాహ్నం 4.27 గంటలకు లద్దాఖ్‌ను భూకంపం కుదిపేసింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 5.4గా నమోదైంది. 


శనివారం నాటి భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకటించింది. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం సంభవించలేదు. లేహ్ నుంచి 129 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉందని తెలిపింది. లేహ్‌లోని స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన చిత్రాలనుబట్టి భవనాల గోడలు పగిలినట్లు కనిపించింది. 

Updated Date - 2020-09-26T11:40:33+05:30 IST