Abn logo
Jul 5 2020 @ 07:04AM

లద్దాఖ్ కార్గిల్‌లో భూకంపం

కార్గిల్ (జమ్మూకశ్మీర్) : పొరుగు దేశాలకు చెందిన బలగాల మోహరింపుతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని లద్దాఖ్‌లోని కార్గిల్‌లో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దేశ సరిహద్దుల్లోని కార్గిల్ హిమాలయ పర్వత ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 3.37 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైంది. కార్గిల్ కు ఉత్తరాన 433 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది.లద్దాఖ్, కార్గిల్ ప్రాంతాల్లో భూమి కంపించిందని సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు చెప్పారు. గురువారం కూడా కార్గిల్ లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. వారంరోజుల్లో కార్గిల్ ప్రాంతంలో రెండుసార్లు భూమి కంపించడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోనూ...

అరుణాచల్ ప్రదేశ్ లోనూ ఆదివారం ఉదయం భూమి కంపించింది. పంజీన్ కు ఉత్తరాన 683 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. పంజీన్ ప్రాంతంలో 252 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అధికారులు చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement