ఆ ప్రాంతాన్ని పట్టి పీడుస్తున్నదేంటి?

ABN , First Publish Date - 2020-07-27T18:40:28+05:30 IST

ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు.. ఊరుకు ఊరు ఏమైపోతుందో తెలియదు.

ఆ ప్రాంతాన్ని పట్టి పీడుస్తున్నదేంటి?

సూర్యాపేట్ జిల్లా: ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు.. ఊరుకు ఊరు ఏమైపోతుందో తెలియదు. ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు కంటిమీద కునుకులేకుండా బతుకీడుస్తున్నారు. దేశమంతా కరోనాతో వణికిపోతే.. మరి ఆ ప్రాంతాన్ని పట్టి పీడుస్తున్నదేంటి? సూర్యాపేట జిల్లాలో భూ ప్రకంపనలు ప్రజలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందోనన్న భయంతో కాలం వెల్లదీస్తున్నారు. రాత్రి అయితే చాలు ప్రజలు జాగారం చేయాల్సి వస్తోంది. దాదాపు ఆరు నెలలుగా జిల్లాలో 12 వందలసార్లు భూమి కంపించింది. 


సూర్యపేట్ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం కృష్ణా పరివాహక ప్రాంతంలో వరుస భూకంపాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు కనీసం 20 సార్లు భూమి నుంచి భారీ శబ్దాలు వస్తున్నాయి. దీంతో గోడలు బీటలు వారుతున్నాయి. శబ్దాలకు ఇంట్లో సామాగ్రి కిందపడిపడుతోంది. దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలు చిన్న శబ్ధం వచ్చినా వణికిపోతున్నారు. అందుకు కారణం తరచూ ఇక్కడ భూకంపాలు రావడమే. ప్రధానంగా చింతలపాలెం మండలంలో గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 12 వందల సార్లు వరుస భూ కంపాలు సంభవించాయి. 

Updated Date - 2020-07-27T18:40:28+05:30 IST