Abn logo
Sep 21 2021 @ 07:16AM

Japan:వారం రోజుల్లో మూడుసార్లు భూకంపం

టోక్యో : జపాన్ దేశంలో మంగళవారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. జపాన్ దేశ రాజధాని నగరమైన టోక్యోకు 1593 కిలోమీటర్ల దూరంలో మంగళవారం తెల్లవారుజామున 1.55 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది.10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. గడచిన ఏడు రోజుల్లో జపాన్ దేశంలో రెండు భూకంపాలు సంభవించాయి. ఈ నెల 16వతేదీన సుజు షీ, ఇషికవా, టోయమా ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ నెల 20వతేదీన ఒఖోట్స్, కురిల్ ఎస్కే, సఖ్లిల్ ఒబ్లాస్ట్ ప్రాంతాల్లో భూకంపం వచ్చింది.ఏడు రోజుల్లో మూడుసార్లు భూకంపం సంభవించడంతో జపాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption