పసిఫిక్ మహాసముద్రం టోంగా సమీపంలో భూకంపం

ABN , First Publish Date - 2020-10-01T13:44:21+05:30 IST

ఫసిఫిక్ మహా సముద్రంలోని టోంగా సమీపంలో గురువారం భూకంపం సంభవించింది....

పసిఫిక్ మహాసముద్రం టోంగా సమీపంలో భూకంపం

నుకు అలోఫా (టోంగా) : ఫసిఫిక్ మహా సముద్రంలోని టోంగా సమీపంలో గురువారం భూకంపం సంభవించింది. గురువారం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. లిఫుకా దీవులకు పశ్చిమాన పంగాయ్ గ్రామ సమీపంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. టోంగాలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుడు జరుగుతుంటాయి. 

Updated Date - 2020-10-01T13:44:21+05:30 IST