Abn logo
Jan 16 2021 @ 09:27AM

చెట్టును ఢీకొన్న కారు...ఒకరి మృతి

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం కందాలపాలెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement
Advertisement