33వ జడ్పీ చైర్మన్‌గా విప్పర్తి బాధ్యతలు

ABN , First Publish Date - 2021-10-02T07:03:07+05:30 IST

భానుగుడి(కాకినాడ), అక్టోబరు 1: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌ అన్నారు. కాకినాడ జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన 33వ జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిం

33వ జడ్పీ చైర్మన్‌గా విప్పర్తి బాధ్యతలు
బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న చైర్మన్‌ విప్పర్తి

ప్రభుత్వ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ముందున్న లక్ష్యం

భానుగుడి(కాకినాడ), అక్టోబరు 1: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌ అన్నారు. కాకినాడ జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన 33వ జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్ర మానికి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుఽభాష్‌ చంద్రబోస్‌, ముఖ్యఅతిథిగా పాల్గొనగా జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ ఫైల్‌పై మొదటి సంతకం చేయిం చుకున్నారు. ఈ సందర్భంగా పలువురికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ అతిపెద్ద జిల్లాలో చైర్మన్‌గా బాధ్యతలు స్వీక రించడం ఆనందంగా ఉందని, సీఎం జగన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానీయకుండా పనిచేస్తానన్నారు. ఎంపీడీవోల సమన్వయంతో పేదల ఇళ్ల నిర్మా ణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాలను మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరి సమన్వయంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ ఉపాధ్యక్షులు మెరుగు పద్మలత పాల్గొన్నారు.


Updated Date - 2021-10-02T07:03:07+05:30 IST