Advertisement
Advertisement
Abn logo
Advertisement

గిరిజన మహిళకు వైసీపీ ఉపసర్పంచ్ బెదిరింపులు...ఆడియో వైరల్

రాజమండ్రి:  ఎన్నికల్లో పోటీ చేయబోతున్న గిరిజన మహిళ పట్ల వైసీపీ నేత బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కాచవరం పంచాయతీ ఒకటో వార్డుకు శిరీష అనే గిరిజన మహిళను నామినేషన్ వేశారు. శిరీష్ నామినేషన్ వేయడంపై వైసీపీ ఉప సర్పంచ్ చామంతుల వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.


శిరీషను వెంకన్న ఫోన్‌లో బెదిరించారు. ప్రస్తుతం ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే పోలవరం పునరావాస ప్యాకేజీ రాకుండా చేస్తానంటూ హెచ్చరించారు. వైస్ ప్రెసిడెంట్ చామంతుల వెంకన్న బెదిరింపులపై శిరీష్ ఆందోళన వ్యక్తం చేశారు. నిండు గర్బీణిని అయిన తనను, తన కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలిసిన రంపచోడవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి.. శిరీషకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement