AP: ఉప్పాడ, అంతర్వేదిలో సముద్రం అల్లకల్లోలం

ABN , First Publish Date - 2021-11-12T15:25:22+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాలో వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంది.

AP: ఉప్పాడ, అంతర్వేదిలో సముద్రం అల్లకల్లోలం

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, గాలులతో 27 మండలాల్లో 61,893 ఎకరాల్లో వరి నేలకొరిగింది. కాకినాడ పోర్టులో  ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక  కొనసాగుతోంది. విదేశీ నౌకల్లోకి నిన్నటి నుంచి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. బార్జీలన్నింటినీ నిలుపుదల చేశారు. అటు వాయుగుండం ప్రభావంతో ఉప్పాడ, అంతర్వేదిలోనూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. 

Updated Date - 2021-11-12T15:25:22+05:30 IST