Abn logo
Apr 7 2020 @ 10:05AM

నేటి నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు

తూర్పుగోదావరి: జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసులు 11కి చేరుకున్నాయి. ఒకరు కోలుకున్నారు. ఐదు  ప్రాంతాల్లో రెడ్ జోన్లు కొనసాగుతున్నాయి. రాజమండ్రి, అమలాపురం  క్వారంటైన్  సెంటర్లలో 40 మంది ఉన్నారు. రాజమండ్రి అర్బన్ జిల్లా పరిధిలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన 452 మంది వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చిరు వ్యాపారులకు సంబంధించిన 18 తోపుడు బండ్లను సీజ్ చేశారు. 


జిల్లాలో నేటి నుంచి మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రబీ వరి కోతల కోసం తమిళనాడు సహా వివిధ జిల్లాల నుంచి  460 యంత్రాలు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సామాజిక దూరం నిబంధనలు బేఖాతరు  చేస్తున్న నేపథ్యంలో ఇకపై ఆదివారం నాన్ వెజ్  అమ్మకాలు జరపరాదని  రాజమండ్రి కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement
Advertisement