తూ.గో. జిల్లాలో ఒమైక్రాన్ కలకలం..

ABN , First Publish Date - 2021-12-16T14:15:52+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా: కోనసీమలో ఒమైక్రాన్ కలకలం చెలరేగింది.

తూ.గో. జిల్లాలో ఒమైక్రాన్ కలకలం..

తూర్పుగోదావరి జిల్లా: కోనసీమలో ఒమైక్రాన్ కలకలం చెలరేగింది. విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యాధికారులు వారి నుంచి శాంపిల్స్‌ను సేకరించి ఒమైక్రాన్‌ నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత ఒమైక్రానా, కాదా అనేది తేలాల్సి ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా విదేశీ ప్రయాణికులపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిఘా పెంచారు. జిల్లాలో ఇప్పటివరకు 2746 మంది వివిధ దేశాల నుంచి జిల్లాకు చేరుకోగా, వారిలో 2673 మంది చిరునామాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. వారిలో 928 మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అడిషనల్‌ డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ బి.మీనాక్షి వెల్లడించారు. 

Updated Date - 2021-12-16T14:15:52+05:30 IST