Abn logo
Jun 24 2021 @ 12:26PM

ఉప్పాడ సముద్ర తీరంలో బోటు బోల్తా..

తూ.గో. జిల్లా: ఉప్పాడ సముద్ర తీరం వద్ద మత్స్యకారుల బోటు బోల్తాపడింది. వేటకు వెళ్లి చేపలతో తిరిగి ఒడ్డుకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాకాసి అలల తాకిడితో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. బోటులో ఉన్న వలలు, సామాగ్రి, చేపలు సముద్రంపాలయ్యాయి. సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు.

హైదరాబాద్మరిన్ని...