Advertisement
Advertisement
Abn logo
Advertisement

తూ.గో. జిల్లా: ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

తూ.గో.జిల్లా: వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇద్దరి పొలిటికల్ వార్ కాస్త దోపిడీ ఆరోపణల వరకు వెళ్లింది. బూరుకుపూడి ఆవ భూముల కొనుగోళ్లలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌తో కలిసి భరత్ అవినీతికి పాల్పడ్డారని రాజా బాంబు పేల్చారు. ఆవ భూముల తరహాలోని పురుషోత్తపట్నం రైతుల నుంచి డబ్బులు దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాజా ఆరోపణలకు భరత్ కౌంటర్ ఇచ్చారు. తాను నిస్వార్థంగా పనిచేస్తున్నానని అన్నారు. ‘మీరు చిటికేస్తే వచ్చేవాళ్లు ఎవరంటూ’ ఎంపీ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement